న్యాయమూర్తిపై రేప్ కేసు: సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

అదనపు జిల్లా జడ్జిపై నమోదైన అత్యాచార కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది అని పిటిషనర్ తరఫు న్యాయవాది రాకేష్ కుమార్ సింగ్ తెలిపారు. మాయూర్ విహార్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో నిందితుడిగా ఉన్న జడ్జిని సస్పెండ్ చేయాలని కోరుతూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.