రాజమహేంద్రవరం: పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆధునిక వైద్య సేవలు అందిస్తామని స్పష్టీకరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: తూర్పు గోదావరి
పశు సంపద పెంపుదలకు అన్ని విధాలుగా తగిన కృషి చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. అన్ని రకాల ఆధునిక మందులతో పాడి పరిశ్రమను మరింతగా పెంపొందించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పాలు, ఇతర ఉత్పత్తులను పెంచి పాడి రైతులకు ఇది లాభసాటిగా ఉండేలా నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.