నెల్లూరు ఐసీడీఎస్ నూతన పీడీగా నాగశైలజ నియామకం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లా స్త్రీ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నాగశైలజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పీడీగా పనిచేసిన బి. హేనా సుజన్ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్గా నాగశైలజ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ మరియు పర్యవేక్షణ కార్యక్రమాలను ఆమె సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది.