ఏపీలో సైబర్ నేరాలకు అడ్డుకట్టే లక్ష్యంగా 'సైబర్ గార్డ్' ఏర్పాటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

సైబర్‌ నేరాలను అణచివేయడమే లక్ష్యంగా ఏపీ పోలీసులు ‘సైబర్‌ గార్డ్‌’ (ఎస్‌4సీ) విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ సమీపంలో రూ.10.77 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 259 మంది సిబ్బందితో ఇది పనిచేయనుంది. డిజిటల్ ఆధారాల సేకరణ, నేరాల ముందస్తు హెచ్చరికలు, బాధితుల సొమ్ము కాపాడేందుకు ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.