ముంచంగిపుట్టు బంగారుమెట్ట వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా కొండలరావు నామినేషన్
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: ముంచింగిపుట్టు
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట సెగ్మెంట్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా వంతల కొండలరావు ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్యలింగంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొండలరావు స్థానిక ఓటర్లను ప్రత్యేకంగా అభ్యర్థించారు.