విజయవాడ దుర్గ గుడిలో భవానీ ప్రత్యేక దర్శన టికెట్లు ధర వెయ్యి
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయవాడ
విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతమున్న వంద, మూడు వందలు, ఐదు వందల రూపాయల టికెట్లను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీఐపీలు మరియు సిఫార్సులపై వచ్చేవారి కోసం వెయ్యి రూపాయలతో భవానీ ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక దర్శనం ద్వారా భక్తులకు అంతరాలయ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.