రామభద్రపురంలో మోసం: తక్కువ ధరల పేరుతో ఎనిమిది లక్షలతో వ్యాపారి ఉడాయంపు
రిపోర్టర్: సురేష్
స్థలం: రామభద్రపురం
తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ అందజేస్తామని నమ్మించి వంద మంది ఖాతాదారుల నుంచి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి పరారయ్యాడు. రామభద్రపురం మండల కేంద్రంలో దుకాణం నిర్వహిస్తున్న సదరు వ్యాపారి ఆర్డర్ల పేరుతో నగదు తీసుకుని వారం రోజులుగా కనిపించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జ్ఞానప్రసాద్ తెలిపారు.