చెన్నైలో తీవ్ర విషాదం: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పెద్దమ్మ కన్నుమూత

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ వయోధిక ఆరోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. చెన్నై నీలాంకరైలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆమె భౌతికకాయానికి శుక్రవారం ముఖ్యమంత్రి విజయ్ తో పాటు ఆయన తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.