శ్రీశైల దేవస్థానంలో కలకలం: టెండర్ల ప్రక్రియలో అలసత్వంపై ముగ్గురు ఇంజనీరింగ్ ఉద్యోగుల సస్పెన్షన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీశైలం

శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల ప్రక్రియలో తీవ్ర అలసత్వం వహించిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఈవో ఎం.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. డిప్యూటీ ఈఈ చంద్రశేఖర శాస్త్రి, వర్క్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కాంట్రాక్ట్ ఏఈఈ జైపాల్ నాయక్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎండోమెంట్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.