మోసూరువలసలో విద్యుత్ స్తంభం కలకలం: ఏడాదిగా కనెక్షన్ ఇవ్వని వైనంపై ఆవేదన
రిపోర్టర్: B RAJESH
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి మండలం మోసూరువలస గ్రామంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న పాత విద్యుత్ స్తంభం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. కొత్త స్తంభం ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా అధికారులు కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో పాత స్తంభం ప్రమాదకరంగా మారింది. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.