వర్షాభావంతో మహారాష్ట్రలో ఎండిపోయిన పత్తి సోయా పంటలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Yavatmal, Maharashtra

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత 55 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట మొక్కలు ఎదుగుదల లేక ఎండిపోతున్నాయని రైతు మనీష్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి వర్షం పడకపోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.