పులివెందులలో కాల్పుల కలకలం, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: కడప

కడప జిల్లా పులివెందులలో వినాయక విగ్రహం వద్ద టీడీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక నేతలు పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం రాళ్ల దాడికి, వాహనాల ధ్వంసానికి దారితీసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన హజ్ కమిటీ డైరెక్టర్ భాషా గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పులివెందులలో తీవ్ర కలకలం రేగింది.