వైద్య ఆరోగ్య రంగంలో కీలక పరిణామం: కంటి రెటీనా స్కాన్తో గుండె జబ్బుల గుర్తింపు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

కంటి రెటీనాలోని సూక్ష్మ రక్తనాళాల పరీక్ష ద్వారా గుండె జబ్బుల ముప్పును ప్రాథమికంగా అంచనా వేయవచ్చని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ మాదిరెడ్డి తెలిపారు. శరీరంపై ఎలాంటి కోతలు లేకుండా ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ స్కానింగ్ పద్ధతి ద్వారా రక్తనాళాల మార్పులను స్పష్టంగా పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఇది గుండెపోటును పూర్తిగా నిర్ధారించలేదని, కేవలం రిస్క్ అసెస్మెంట్ టూల్గా మాత్రమే ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.