బంగ్లాదేశ్‌కు మహిళను పంపడంపై గౌహతి హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: అసోం
ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వకుండానే ముంతాజ్ బేగంను బంగ్లాదేశ్‌కు పంపడంపై గౌహతి హైకోర్టు అసోం ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆమె భర్తకు రూ. 2 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఇవ్వకుండా కస్టడీకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇకపై విదేశీయులుగా ప్రకటించిన వారికి ఉచితంగా కాపీ అందజేయాలని తేల్చిచెప్పింది.