ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. 45.63 శాతం ఉత్తీర్ణత నమోదు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో టెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 45.63 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కేటగిరీలో 50.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు లేదా వాట్సాప్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.