తిరుమలలో అత్యంత వైభవంగా ముగిసిన శ్రీవారి భాగ్‌ సవారి ఉత్సవం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తిరుమల

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు భాగ్‌ సవారి ఉత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి మాడవీధిలో అప్రదక్షిణంగా ఊరేగుతూ అనంతాళ్వారు తోటకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. అంతకుముందు పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు నాళాయర దివ్య ప్రబంధం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.