నాటుసారా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారుల ఆదేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ వి. సోమిరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ముడిసరుకుల సరఫరాదారులపై నిఘా ఉంచాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్. కిషన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.