మున్సిపల్ ఎన్నికలు: వైఎస్సార్సీపీకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ, అప్పీల్ పిటిషన్ డిస్మిస్
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల వేళ వైఎస్సార్సీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, కేంద్ర బలగాల అవసరం లేదని అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ చేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు.