ఆదర్శ కుటుంబం సినిమా వివాదం: పర్ణశాల పాటపై సింగర్ లక్ష్మి ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఆదర్శ కుటుంబం చిత్రంలో అనుమతి లేకుండా పర్ణశాల సినిమాలోని జిమ్ జిమ్ తార పాటను వాడుకున్నారంటూ సింగర్ లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కాపీరైట్స్ లేదా డబ్బులు చెల్లించకుండా పాటను వాడుకోవడంపై ఆమె చిత్ర యూనిట్ను నిలదీశారు. వెంటనే ఆ పాటను పూర్తిగా తొలగించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.