తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన: కోనసీమలో పంటల పరిశీలన చేపట్టిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు, వేట్లపాలెం గ్రామాలను సందర్శించి తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతన్నలకు ధైర్యం చెప్పడంతో పాటు దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను స్వయంగా పరిశీలించారని CMO ఆంధ్రప్రదేశ్ వెల్లడించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో దెబ్బతిన్న 5,400 గ్రామాలకు గాను ఇప్పటికే 4,771 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.