అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసు: పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: శివ స్థలం: అయోధ్య

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసిందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వెల్లడించారు. విచారణను స్థానిక కోర్టు కొనసాగిస్తుందని స్పష్టం చేసిన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం, ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను సోమవారం కొట్టివేసింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో నిధులు దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో తేలిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.