బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కవిత డిమాండ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రోజువారీ తీవ్రమైన ఒత్తిడి, పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ ఎంతో న్యాయమైనదని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిటల్ బ్యాంకింగ్ పెరిగినప్పటికీ సిబ్బందిపై భారం తగ్గలేదని, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.