ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం రూల్స్ మార్పు!
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు భారీ షాక్ తగిలింది. వచ్చే అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త ఏటీఎం నిబంధనలు అమల్లోకి రానున్నాయి. శాలరీ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో జరిపే ఉచిత లావాదేవీలను 10 నుంచి 5కి తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ లిమిట్ దాటితే క్యాష్ విత్ డ్రాపై రూ. 23, బ్యాలెన్స్ చెక్ లేదా మినీ స్టేట్ మెంట్ పై రూ. 11 చొప్పున జీఎస్టీతో కలిపి భారీ ఛార్జీలు వడ్డించనున్నారు.