ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పక్షపాత వైఖరిపై ఉపేందర్‌రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి విమర్శించారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇళ్ల కేటాయింపుల్లో సొంత పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. కమిటీలను రద్దు చేసి లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.