'భారత్ వాణిజ్యాన్ని దెబ్బతీసేలా చట్టం': రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా కొత్త ఆంక్షలు
రిపోర్టర్: శివ
స్థలం: అమెరికా
అమెరికా ప్రతినిధుల సభ రష్యా, ఇరాన్‌లపై గ్రెహాం ఆంక్షల బిల్లును ఆమోదించడంతో భారత్‌కు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. రష్యా నుంచి మునుపెన్నడూ లేని విధంగా చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్, స్లొవేకియా, హంగేరి దేశాలను లక్ష్యంగా చేసుకుంటూ అమెరికా కాంగ్రెస్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. రష్యా ఇంధన కొనుగోళ్ల ఆధారంగా అమెరికా మార్కెట్లోకి భారతీయ వస్తువుల ప్రవేశంపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉండటంతో ఇంధన భద్రత, ఎగుమతుల మధ్య భారత్ కఠినమైన ఆర్థిక సమీకరణాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.