భోపాల్‌లో థార్ కారు బీభత్సం, డ్రైవర్ వీరంగంతో వణికిపోయిన కాలనీ వాసులు
రిపోర్టర్: రాము
స్థలం: భోపాల్
భోపాల్‌లోని మిస్రోద్ ప్రాంతంలో అదుపుతప్పిన థార్ ఎస్‌యూవీ కారు తీవ్ర భయానక వాతావరణం సృష్టించింది. కాలనీలోకి అతివేగంగా దూసుకొచ్చిన డ్రైవర్, పార్క్ చేసిన డజనుకు పైగా కార్లను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. అంతేకాకుండా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, పిల్లలపైకి కారు పోనిచ్చేందుకు యత్నించడంతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. సెక్యూరిటీ గేటును బద్దలు కొట్టి పరారైన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.