జైపూర్‌లో దారుణం: భార్య, ముగ్గురు కుమార్తెల హత్య
రిపోర్టర్: రమేష్
స్థలం: జైపూర్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. స్టాక్ మార్కెట్ నష్టాలు మరియు ఆస్తి వివాదం నేపథ్యంలో భార్య గీతతో పాటు ముగ్గురు కుమార్తెలను భర్త రాహుల్ ఇటుకతో తలపై కొట్టి కిరాతకంగా హతమార్చాడు. హత్యల అనంతరం పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.