వరద నిల్వకు రెండు కొత్త బ్యారేజీలు నిర్మించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా యాభై కేజీల బియ్యం అందించాలని ఆయన ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతలకు దిగువన రెండు నూతన బ్యారేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.