రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు: నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఓటర్లు
రిపోర్టర్: శివ
స్థలం: Amaravati
రాష్ట్రంలోని నగర, పురపాలక ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 28న జరగనున్న వంద పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు రెండు శాతానికి పైగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్లోనూ అతివలదే పూర్తి ఆధిక్యం కొనసాగుతోందని స్పష్టం చేశారు.