గూగుల్లో నా పేరు రావడం ఎపిక్ మూమెంట్: వైష్ణవి చైతన్య
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో జరిగిన ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య భావోద్వేగానికి లోనయ్యారు. కెరీర్ ఆరంభంలో ‘నిన్ను ఎవరు గుర్తుపడతారు?’ అని అవమానించిన వారికి, ఇప్పుడు గూగుల్లో తన పేరు సెర్చ్ చేస్తే వివరాలు రావడం గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్నను స్ఫూర్తిగా పేర్కొంటూ వైష్ణవి తన సంతోషాన్ని పంచుకున్నారు.