బీసీ రిజర్వేషన్ల జీవోపై చంద్రబాబుకు ధర్మాన కృష్ణదాస్ సూటి ప్రశ్నలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో 176 ద్వారా బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైందని శ్రీకాకుళం ప్రాంత నేత ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల అమలుపై ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తూ ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.