తిరుమల ఆలయం వద్ద రీల్స్ ప్రమోషన్ కలకలం
రిపోర్టర్: హరి
స్థలం: Tirumala
శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుమల ఆలయం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సంస్థ ప్రమోషన్ నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. దర్శిణి ఫ్యాషన్స్కు చెందిన మహిళా మేకప్ ఆర్టిస్ట్, రీల్స్ కళాకారులతో ఆలయం ముందు నిలబడి ప్రైవేట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం మాట్లాడిస్తూ వీడియోలు రూపొందించారు. అత్యంత పవిత్రమైన తిరుమలలో ఇలాంటి వాణిజ్య ప్రకటనల రీల్స్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీటీడీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.