నర్సీపట్నంలో నామినేషన్ల తిరస్కరణపై విమర్శలు గుప్పించిన బాధితులు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. మొదట అంగీకరించిన నామినేషన్లను సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా తిరస్కరించినట్లు అధికారులు తెలపడం దారుణమని వాపోయారు. ఎక్కడా లేని విధంగా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.