భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రహదారి బందైన రాకపోకలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం కళావల్లి, చిన్న కళావల్లి గ్రామాల మధ్య భారీ వర్షాలకు తామర చెరువు గండిపడి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. చెరువు నీరు ఉధృతంగా రోడ్డుపైకి చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. వందలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగిందని, అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో పాటు పంట నష్టపరిహారం అందించాలని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.