మహిళల భద్రతకు షీ టీమ్స్ అండగా ఉంటాయని సైబరాబాద్ పోలీసులు స్పష్టీకరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మహిళలపై వేధింపులు ఎదురైతే ఎవరూ భయపడి మౌనంగా ఉండవద్దని, వెంటనే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. బాధితులకు షీ టీమ్స్ ఎప్పుడూ అండగా ఉంటాయని వారు భరోసా కల్పించారు. మహిళల భద్రత తమ అత్యున్నత ప్రాధాన్యమని పోలీసులు స్పష్టం చేస్తూ, ఈ మేరకు అవగాహన కోసం ప్రత్యేక వీడియోను విడుదల చేసినట్లు వెల్లడించారు. వేధింపులపై ఫిర్యాదులను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.