తొండవాడ ఆలయంలో మూడు రోజుల పాటు వైభవంగా రుద్రోత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చంద్రగిరి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 24 నుంచి 26 వరకు రుద్రోత్సవాలు, అన్నాభిషేకం, కళ్యాణోత్సవం జరగనున్నాయి. ఆదివారం రాత్రి పరమశివుని దివ్యరూపాన్ని ఆవిష్కరించే లేజర్ లైట్ షో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.