మురసు తుపాను హెచ్చరిక: అధికారులను అప్రమత్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
మురసు తుపాను ముప్పు నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్ర ప్రభావం చూపే జిల్లాల్ లో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.