స్తంభించిన బ్యాంక్ సర్వర్: తీవ్ర ఇబ్బందుల్లో ఖాతాదారులు, పెన్షనర్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఆమదాలవలస విశాఖ గ్రామీణ బ్యాంకులో గత నాలుగు రోజులుగా బ్యాంక్ సర్వర్ పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా పై అధికారులకు తెలియజేశామని చెప్పారని ఆమదాలవలస పెన్షనర్ల అసోసియేషన్ కోశాధికారి హెచ్ వి సత్యనారాయణ గురువారం తెలిపారు. పై అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.