ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటాం: కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన రణభేరి సదస్సులో ఆయన మాట్లాడారు. నవంబరులో 3.50 లక్షల మంది ఉద్యోగులతో అతిపెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెనకాడబోమని జేఏసీ నేతలు హెచ్చరించారు.