ఉమ్మడి కృష్ణా జిల్లాలో వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన: ఏటా రెండు వందల ఫిర్యాదులు

రిపోర్టర్: రమేష్ స్థలం: కృష్ణా జిల్లా

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కన్నబిడ్డల చేతిలో మోసపోయి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. ఆస్తులు రాయించుకుని కొడుకులు తమను బయటకు గెంటేస్తున్నారని వివిధ వేదికల్లో ఏటా సుమారు రెండు వందల మంది వరకు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ముదిమి వయసులో ఆసరా కల్పించాల్సిన కుటుంబ సభ్యులే నిర్లక్ష్యం చేస్తుండటంతో వృద్ధులు దిక్కుతోచని స్థితిలో అధికారులను ఆశ్రయిస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.