విశాఖలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు: కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నగర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యంలో, నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అలాగే మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులకు ఉచిత ఆహార పంపిణీ సేవలను పోలీసు శాఖ నిరంతరం కొనసాగిస్తోందని వెల్లడించారు.