మహాకుంభ్ యువతి పుట్టిన తేదీ మార్పు ఉత్తర్వులు రద్దు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖర్గోన్

మహాకుంభ్ ప్రఖ్యాతి పొందిన యువతి పుట్టిన తేదీని మారుస్తూ మున్సిపల్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జస్టిస్ గజేంద్ర సింగ్ స్పష్టం చేశారు. బాధితురాలి వాదనలను కూడా పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారం కొత్తగా నిర్ణయం తీసుకోవాలని మహేశ్వర్ సీఎంఓను హైకోర్టు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.