రామమందిర విరాళాల చోరీ నిందితుల బెయిల్ విచారణ వాయిదా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అయోధ్య

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో మిగిలిన ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణను బుధవారం ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది. స్థానిక బార్ అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని నిందితుల తరఫు న్యాయవాది కుల్ శేఖర్ సింగ్ వెల్లడించారు. వేలాది పేజీలతో కూడిన ఛార్జిషీట్ కాపీని ఇంకా తాము అందుకోలేదని ఆయన తెలిపారు.