గ్రూప్-1 అక్రమాలపై హైకోర్టుకు తుది నివేదిక సమర్పించిన సిట్
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఏడుగురు అభ్యర్థుల ఫోరెన్సిక్ నివేదికలతో కూడిన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టులో సిట్ దాఖలు చేసింది. కక్షిదారుల తరఫు న్యాయవాదులు దరఖాస్తు చేసుకుంటే నివేదిక అందించాలని రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. అప్పీళ్ల తుది విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.