గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేసిన కేంద్రం

రిపోర్టర్: మహేష్ స్థలం: భారతదేశం

గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే వచ్చే అక్టోబర్ 1, 2026 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నకిలీ కనెక్షన్లను తొలగించి పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 89.9 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేయగా, మిగిలిన వారు డెలివరీ సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.