హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్: మెట్రో, ఆర్టీసీ బస్సుల కోసం సంయుక్త పాస్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరవాసులకు రవాణా సౌకర్యాలను మరింత సులభతరం చేసేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు హాయ్ హైదరాబాద్ వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో రైలు మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిటీ బస్సుల కోసం నూతనంగా సంయుక్త ప్రయాణ పాస్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించింది. ఈ మేరకు సోమవారం నుంచి ఈ ఉమ్మడి పాస్ అందుబాటులోకి వచ్చిందని పేర్కొంటూ, నగరంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.