దేశ రక్షణ రంగ ఎగుమతుల్లో అపూర్వ వృద్ధి సాధించినట్లు వెల్లడించిన అర్వింద్ ధర్మపురి
రిపోర్టర్: నరేష్
స్థలం: నిజామాబాద్
భారత దేశ రక్షణ రంగ ఎగుమతులు సరికొత్త మైలురాయిని తాకాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వెల్లడించారు. రెండు వేల పదమూడు పద్నాలుగో ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు, రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఏకంగా ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు ఐదు వేల ఐదు వందల శాతానికి పైగా భారీ వృద్ధి నమోదైనట్లు రక్షణ రంగ గణాంకాల ఆధారంగా ఆయన స్పష్టం చేశారు.