జపాన్లో భారీ భూకంపం కలకలం: బోనిన్ దీవుల్లో రిక్టర్ స్కేలుపై ఆరు మూడు తీవ్రత నమోదు

రిపోర్టర్: సునీల్ స్థలం: జపాన్

జపాన్ దేశంలోని బోనిన్ దీవుల సమీప ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై ఆరు మూడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదని అధికారులు స్పష్టం చేశారు.