గోషామహల్ స్టేడియంలో అమరవీరుల స్మారకాన్ని పరిశీలించిన డీజీపీ సి.వి. ఆనంద్
రిపోర్టర్: రాము
స్థలం: Goshamahal, Hyderabad
అక్టోబర్ 21న జరగనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యంలో గోషామహల్ స్టేడియాన్ని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ సందర్శించారు. అక్కడ నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారకాన్ని ఆయన పరిశీలించారు. అలాగే 48 గుర్రాల కోసం నిర్మిస్తున్న కొత్త హార్స్ స్టేబుల్ కాంప్లెక్స్ పనులతో పాటు డాగ్ స్క్వాడ్ వసతులను కూడా డీజీపీ స్వయంగా పరిశీలించినట్లు టిజి పోలీస్ వెల్లడించారు. ఈ ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.