సీఎంఆర్ ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలంటూ మిల్లర్లకు అదనపు కలెక్టర్ హెచ్చరిక

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

సీఎంఆర్ ధాన్యం బకాయిలను గడువులోగా చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాలని రైస్ మిల్లర్లను ఆయన గట్టిగా ఆదేశించారు.